ఇజ్రాయెల్‌ ప్రధానిపై అవినీతి విచారణ

ఇజ్రాయెల్‌ ప్రధానిపై అవినీతి విచారణ



బెంజమిన్‌ నెతన్యాహుపై ఛార్జిషీట్‌ దాఖలు


టెల్‌ అవివ్‌: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోనున్నారు. అధికారంలో ఉన్న ఓ ప్రధాని ఇలా విచారణ ఎదుర్కోవడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అవినీతి, మోసం, నమ్మక ద్రోహాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై మూడు వేర్వేరు కేసులను నమోదు చేసినట్టు ఇజ్రాయెల్‌ అటార్నీ జనరల్ అవిచాయ్‌ మండెల్బ్లిట్‌ ప్రకటించారు. ఈ మూడు కేసుల్లో నెతన్యాహు మీద చార్జిషీటు తెరిచినట్టు కూడా ఆయన తెలిపారు. దీంతో బెంజమిన్‌ వ్యక్తిగత, రాజకీయ భవితవ్యం చిక్కుల్లో పడనుంది.